Header Ads

 

Food you should not refrigerator in telugu - మీరు ఫ్రీజర్ లో ఉంచుకోవడానికి కొన్ని ఆహార పదార్థాలు.

Food you should not refrigerator in telugu - మీరు ఫ్రీజర్ లో ఉంచుకోవడానికి కొన్ని ఆహార పదార్థాలు.

        లాక్ డౌన్ నేపథ్యంలో చాలా మంది భయాందోళనలతో తమ వంట వస్తువులను , తినే వాటిని ఫ్రీజర్ లో నిల్వ చేస్తున్నారు . ఇలా నిల్వ చేయడం వల్ల ఆహార పదార్థాలు వాటి సహజ గుణాన్ని కోల్పోతాయి . అయితే ఈ లాక్ డౌన్ మరియు ఆ తర్వాత ఫ్రీజర్ లో నిల్వ చేయకూడని కొన్ని ఆహార పదార్థాల గురించి మీకు ఇక్కడ వివరిస్తున్నాం.

1. పాల ఉత్పత్తులు :
    పాలను నిల్వచేయాలని ప్రతి ఒక్కరు భావిస్తూ ఉంటారు . అయితే అందరి మాటలు వినకుండా పాల డబ్బాలను ఎక్కువ రోజులు నిల్వ చేయకండి.

2. నూడిల్ నూడిల్ : 
    ఈ లాక్ డౌన్లో మీరు నూడిల్స్ తయారు చేయాలనుకుంటున్నారా ? అయితే చేసిన వెంటనే వాటిని ఫ్రీజర్ లో పెట్టకుండా తినేయండి . మీరు ఫ్రీజర్ లో పెడితే వాటి రుచి తగ్గిపోతుంది . మరింత మెత్తగా తయారు అవుతాయి .

3. దోసకాయ :
     ఫ్రీజర్ లో పెట్టిన దోసకాయలు నోటిలో వేసుకోవడానికి కాకుండా మీ కళ్లమీద పెట్టుకోవడానికి మాత్రమే వాడండి . దోసకాయ ఫ్రీజర్ నుంచి తీసి కట్ చేసిన తర్వాత పొడిగా మారడంతో పాటు రుచి కూడా కాస్త భిన్నంగా ఉంటుంది .

4. పండ్లు :
    డ్రై ఫ్రూట్స్ మాత్రమే ఫ్రీజర్ లో పెట్టడం సురక్షితం . తాజా పండ్లు ఎక్కువ రోజులు ఫ్రీజర్ లో పెట్టడం వల్ల వాటి రుచి మారడంతో వాటి పోషక విలువలు తగ్గిపోతాయి .

5. కాఫీ :
    ఓపెన్ చేసిన కాఫీ ప్యాకెట్లను , కాఫీ గింజలను ఎక్కువ రోజులు ఫ్రీజర్ లో నిల్వ ఉంచలేము . ఆలా చేయడం వల్ల కాఫీ రుచి తగ్గుతుంది . అయితే ఓపెన్ చేయని కాఫీ ప్యాకెట్లను కొన్ని వారాల పాటు ఫ్రీజర్ లో నిల్వ చేయవచ్చు .

6. టమాటో కెచప్ (soss) :
    లాక్ డౌన్ సమయంలో మీ స్థానికంగా ఉన్న దుకాణాలు మూతపడతాయని భావించి టమాటో కెచప్లను తీసుకువచ్చి ఫ్రీజర్ లో నిల్వ చేయడం మంచిది కాదు . ఇలా చేయడం వల్ల దాని రుచి తగ్గిపోతుంది .

7. వేపుడు చేసిన ఆహార పదార్థాలు :
     వేపుడు పదార్థాలు , పకోడీలు , నగెట్స్ , క్రంచీలు చాలా మందికి ఇష్టం . అయితే ఈ వేపుడు చేసిన పదార్థాలను ఫ్రీజర్ లో ఎక్కువ రోజులు నిల్వ చేస్తే పాడైపోతాయి . ఇవి వేడివేడిగా ఉన్నప్పుడే ఆరగించేయండి


చివరగా : 
     ఫ్రీజర్ లో ఉంచడం వల్ల కొన్ని ఆహార పదార్థాలు వాటి ఆకారం కోల్పోవడం , గడ్డకట్టడంతో పాటు రుచి కూడా తగ్గిపోతుంది . కాబట్టి ఫ్రీజర్ లో మీరు ఉంచాలనుకునే ఆహార పదార్థలను తెలివిగా ఎంచుకోండి . మిగిలిన రోజుల్లో మీ ఆహార పదార్థాలను ఎలా వాడుకోవాలో ప్లాన్ చేసుకోండి .




No comments